ఉత్తమ బ్లాగర్‌గా డాక్టర్ లక్ష్మి

- September 21, 2023 , by Maagulf
ఉత్తమ బ్లాగర్‌గా డాక్టర్ లక్ష్మి

దుబాయ్‌: దుబాయ్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లక్ష్మీ లలిత 2023 సంవత్సరానికి ఉత్తమ బ్లాగర్/వ్లాగర్ విభాగంలో ప్రతిష్టాత్మక భారతీయ మహిళా అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి యూఏఈ భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి అధ్యక్షత వహించగా.. ప్రముఖ ఆర్టిస్ట్ సుధా చంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూఏఈ చీఫ్ ఆఫ్ డిప్లమసీ, ప్రోటోకాల్ లైలా రహల్ ఎల్ అత్ఫానీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్తమ బ్లాగర్‌గా డాక్టర్ లక్ష్మిని ఇండియన్ ఉమెన్ గ్లోబల్ అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమం 18 సెప్టెంబర్ 2023న తాజ్ ఎక్సోటికా రిసార్ట్, పామ్ జుమేరాలో జరిగింది. దుబాయ్‌లోని 60,000 మంది సభ్యులు ఓటింగ్ ద్వారా అవార్డు గ్రహితలను ఎన్నుకున్నారు.

డాక్టర్ లక్ష్మి వెటర్నరీ సర్జన్-గోల్డ్ మెడలిస్ట్. ట్రావెల్ ఔత్సాహికురాలు, శాఖాహార ఆహార ప్రియురాలు, భరత నాట్యం మరియు ఒడిస్సీలలో శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణి. ఇద్దరు పిల్లల తల్లి అయిన లక్ష్మి ప్రఖ్యాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె 150 కంటే ఎక్కువ బ్రాండ్‌లతో పనిచేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డాక్టర్స్_వాండర్‌లస్ట్ ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. యూఏఈలో మహిళా యాజమాన్యంలోని వ్యాపారాలను ప్రోత్సహించడం పై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com