గల్ఫ్ నివాసితులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..ఫలించిన మాగల్ఫ్ కృషి

- September 21, 2023 , by Maagulf
గల్ఫ్ నివాసితులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..ఫలించిన మాగల్ఫ్ కృషి

హైదరాబాద్: వేములవాడ, సిరిసిల్ల పరిసర గ్రామాల నుండి గల్ఫ్ లో ఉంటున్న ప్రవాస తెలుగు ప్రజలకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈ నెల 22 నుంచి వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ (RGIA, HYD)కు డీలక్స్ బస్సు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ బస్సు సాయంత్రం (16:30) నాలుగున్నర గంటలకు వేములవాడ బస్టాండ్ నుంచి బయలుదేరి సిరిసిల్లకు 16:45కు చేరుకుని అక్కడి నుండి వయ సిద్దిపేట,జేబీఎస్ (JBS) మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. అక్కడే నైట్ హాల్ట్ చేసి ఉదయం ఐదున్నర (5:30) గంటలకు బయలుదేరి వేములవాడకు ఉదయం 9:30 గంటలకు చేరుకుంటుంది.కావున ఈ అవకాశాన్ని గల్ఫ్ లోని యూఏఈ, ఒమన్,సౌదీ అరేబియా,కువైట్,బహ్రెయిన్,ఖతార్ మరియు వివిధ విదేశాలకు వెళ్లే ప్రయాణికులు వినియోగించుకొని సర్వీసును ఆదరించాలని.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,  ఎండి సజ్జనార్ కోరారు.

బస్సు చార్జీలు: వేములవాడ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెద్దలకు రూ.500, సిరిసిల్ల నుండి రూ.480 గా నిర్ణయించారు.

మాగల్ఫ్ కృషి గల్ఫ్ లోని ప్రవాస భారతీయుల సమస్యల పై స్పందించే మాగల్ఫ్.. తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పై చేసిన కృషి ఫలించింది. ఇటీవల మాగల్ఫ్  ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు హైదరాబాద్ వచ్చిన సమయంలో తెలంగాణ ఆర్టీసీ విసీ మరియు ఎండి సజ్జనార్ ని కలిసారు. శంషాబాద్-వేములవాడ మధ్య ఆర్టీసీ సర్వీస్ లేక ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్య పై వివారించారు. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ పి.జీవన్ ప్రసాద్  కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్, రీజినల్ మేనేజర్ సుచరితలతో మాట్లాడి వెంటనే బస్ సర్వీస్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ బస్సు సర్వీసు ఏర్పాటు చేసిన సజ్జనార్ మరియు TSRTC కు శ్రీకాంత్ చిత్తర్వు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ విన్నపాన్ని అధికారులకు విన్నవించి ఈ బస్సు సర్వీసు సేవను పొందేందుకు కృషి చేసిన మాగల్ఫ్ టీం కు గల్ఫ్ ప్రవాసులు అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com