మూడు కొత్త చిత్రాలకు ఓకే చెప్పిన మంచు మనోజ్

- May 20, 2016 , by Maagulf
మూడు కొత్త చిత్రాలకు ఓకే చెప్పిన మంచు మనోజ్

హీరో మంచు మనోజ్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సోషల్‌మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరికి మనోజ్‌ థ్యాంక్స్‌ చెబుతూ... తను నటించబోయే మూడు కొత్త చిత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించారు.
సీతా మహాలక్ష్మి(మదర్‌ ఆఫ్‌ ర్యాంబో) ఈ చిత్రానికి సాగర్‌ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. కెమెరా: సూర్య, స్టోరీ: కిషోర్‌ గొపు, డైలాగ్స్‌: భవాని ప్రసాద్‌, ఎడిటర్‌: పి. టైగర్‌, స్టంట్స్‌: మంచు మనోజ్‌ కుమార్‌.
రెండో చిత్రం మనోజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.కె. సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీవరుణ్‌ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం టైటిల్‌ ఖరారు చేయలేదు.
మూడో చిత్రం ఎస్‌.ఎన్‌.ఆర్‌ ఫిల్మ్స్‌ ప్రై.లి అండ్‌ న్యూ ఎంపైర్‌ సెల్యులాయిడ్స్‌ పతాకంపై ఎస్‌.ఎన్‌. రెడ్డి, ఎన్‌. లక్ష్మికాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. అచ్చిబాబు సమర్పిస్తున్నారు. కెమెరామెన్‌: వి.కె. రామ రాజు, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌. ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా నిర్ణయించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com