హిమాచల్ లో లోయలో పడ్డ బస్సు; 10 మంది మృతి
- May 20, 2016
హిమాచల్ ప్రదేశ్ లో బస్సు లోయలోకి పడిన దుర్ఘటనలో కనీసం పదిమంది మరణించగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. శుక్రవారం చంబా జిల్లాలో క్రిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చౌహరా డ్యామ్ సమీపంలో అదుపు తప్పి 80 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. సాంఘ్ని నుంచి డల్హౌసీకి బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో చాలామంది స్థానికులేనని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







