అంగరంగ వైభవంగా అక్కినేని పాన్ ఇండియా అవార్డ్స్
- September 23, 2023
10 రాష్ట్రాలకు చెందిన సినీ సామాజిక ప్రముఖులకు ఘన సత్కారం
హైదరాబాద్: స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకొని ఎఫ్.టీ.పి.సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఏ ఎన్ ఆర్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ వేడుక ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నటులు మురళి మోహన్,నిర్మాతలు రమేష్ ప్రసాద్, దామోదర్ ప్రసాద్ , తమ్మారెడ్డి భరద్వాజ, వై.వి.ఎస్ చౌదరి,ప్రసన్న కుమార్, సామాజిక వేత్త వరలక్ష్మి,ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ లు ముఖ్య ఆతిధులుగా విచ్చేసిన ఈ వేడుకలో సినీ సామాజిక రంగాలకు చెందిన వారిని ఘనంగా సత్కరించారు.సంస్థ వ్యవస్తాపకులు చైతన్య జంగా , వీస్ విజయ్ వర్మ పాకలపాటి లు వివిధ రంగాలకు చెందిన ఇంత మందిని ఒక్క చోటకు చేర్చి సత్కరించటం ఎంతో ఆనందదాయకమని, అక్కినేని నాగేశ్వర్రావు అభిమానినైన నేను ఆయన శతజయంతి వేదికకు ముఖ్య అతిధిగా హాజరు కావడం చాలా ఆనందం వేసిందని మురళి మోహన్ అన్నారు. నిత్య విద్యార్థిగా వుండే ఆయన తత్త్వం ఎంతో ఆదర్శప్రాయమని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ మా అందరికి ఆయన ఓ టీచర్ లాంటి వారని, క్రమ శిక్షణ వినయ విధేయతలు అనేవి ఆయనతో ఒక్కరోజు గడిపితే అలవాటు అయిపోతాయని అన్నారు. చివరి రోజులవరకు ఆయనటి అత్యంత సన్నిహితంగా గడిపిన భాగ్యం తనకు దక్కిందని అవార్డు గ్రహీత కాదంబరి కిరణ్ అన్నారు.ఆయనతో గడిపిన ప్రతి క్షణం అమ్మోల్యమైనదని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు.తనను ఆప్యాయంగా పలకరించి అభిమానించిన పెద్దలు అక్కినేని నాగేశ్వర రావు ని దర్శకులు వై.వీ.ఎస్ చౌదరి కొనియాడారు. సినిమా పరంగా కుటుంబపరంగా ఆయనతో తమ సాన్నిహిత్యం ఎంతో మధురమైనది రమేష్ ప్రసాద్ అన్నారు.ఎఫ్.టి.పీ.సి అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ ...దేశవ్యాప్తంగా మరో సారి ఆయన్ని స్మరించుకొనేలా చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే 10 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్కరించుకొనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ...ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం ఆయన అభిమానులతో పాటు వివిధ రంగాల ప్రముఖులను సత్కరించుకొనే అవకాశం కలగడం పూర్వ తమ సంస్థలకు గర్వకారణమని అన్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన చైతన్య జంగా వీస్ విజయ్ వర్మ పాకలపాటి లను ముఖ్య అతిధులు, అవార్డు గ్రహీతలు ప్రశంసించారు.






తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









