మోడీ ఖతార్ పర్యటన ఖరారు
- May 20, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జూన్‌లో రెండు రోజుల పాటు ఖతార్‌లో పర్యటించనున్నారు. గల్ఫ్ దేశమైన ఖతార్‌తో సత్సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు జూన్ 4న ఆయన అక్కడికి వెళుతున్నారు.
ఈ సందర్భంగా ఖతార్ ఎమిర్... షేక్ తామిమ్ బిన్ హమద్ అల్ థానీతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. పలు ఆర్థిక ఒప్పందాలు, హైడ్రోకార్బన్ సెక్టార్‌లో ఒప్పందాలపై దృష్టి సారిస్తారు. వాణిజ్య రంగంలో ఖతార్.. భారత్‌కు ప్రధాన భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఆ దేశంతో 15 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో సత్సంబంధాల్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ ఇప్పటికే యూఏఈలో పర్యటించారు. మే 22, 23 తేదీల్లో ఇరాన్‌లోనూ పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







