పెరుగుతున్న సముద్రపు నీటి మట్టం, ఎందరో ప్రాణాలకు ముప్పు
- May 20, 2016
2050 నాటికి సముద్ర మట్టాలు పెరగనుండటంతో దాదాపు నాలుగు కోట్ల మంది భారతీయులకు ముప్పు పొంచి ఉందని యూఎన్ వాతావరణ నివేదిక పేర్కొంది. జనాభా, అభివృద్ధి కారణంగా ప్రధానంగా ముంబయి, కోల్‌కతాలు వరద ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. ది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అవుట్ లుక్(జీఈవో-6) అంచనాల ప్రకారం ప్రధాన వాతావరణ మార్పులు మొత్తం పసిఫిక్, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవిస్తాయని వివరించింది. సముద్ర మట్టాలు పెరగటంతో నష్టపోయే మొదటి పదిదేశాల్లో ఏడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. వీటిల్లో కూడా నాలుగు కోట్ల మంది జనాభాకు ముప్పుతో భారత్ మొదటి స్థానంలో ఉంది. రెండున్నర కోట్ల మందికి ముప్పుతో బంగ్లాదేశ్ ద్వితీయ స్థానంలో.. రెండు కోట్ల మందితో చైనా మూడో స్థానంలో.. 1.5 కోట్లమందికి ముప్పుతో ఫిలిప్పీన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
సముద్రతీర ప్రాంతాల్లో పెరిగిపోతున్న జనాభా, ఆక్రణమలతో సహజమైన తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లుతోంది.. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నీరు బయటకు పోలేక మరింత ప్రమాదకరంగా మారుతోందని నివేదిక తెలిపింది. చైనాలోని జియంగ్జాహ, షాంగై, భారత్‌లో ముంబయి, కోల్‌కతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్, వియత్నాంలో హోచీ మిన్హ్, హైపోంగ్ ప్రాంతాలకు పెరిగిపోతున్న జనాభా కారణంగా ముప్పు మరింత పెరుగుతోందని హెచ్చరించింది. ఇప్పటికే వీటిల్లో చాలా వరకు వరద ముప్పును ఎదుర్కొన్నాయి. ఈ నివేదిక వచ్చే వారంలో నైరూబీలో జరిగే యూఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీలో పరిశీలనకు రానుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







