తొలిరోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ..
- September 23, 2023
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తొలిరోజు చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు విచారణ తొలిరోజు ముగిసింది. మార్నింగ్ సెషన్ లో 3 గంటల పాటు సీఐడీ అధికారుల విచారించారు. ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేయడం ప్రారంభించారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున గ్యాప్ ఇచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఇచ్చిన అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సీఐడీ విచారణ కొనసాగింది. ఏడు గంటలపాటు మొదటిరోజు చంద్రబాబును ప్రశ్నించారు. రెండు రోజులపాటు సాగే విచారణలో 14 గంటలపాటు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తో మీటింగ్ లపై కూడా చంద్రబాబును ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







