సపోటా ఖీర్ స్వీట్
- May 20, 2016
కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, పంచదార - 3 టేబుల్ స్పూన్లు, సపోట పండ్లు - 4, కుంకుమపువ్వు - కొద్దిగా
తయారుచేసే విధానం
దళసరి అడుగున్న ఒక పాత్రలో పాలను పోసి, చిన్న మంటపైన పాలు సగానికి సగం అయ్యేలా మరిగించాలి. ఈలోపుగా సపోటాలని పొడుగాటి ముక్కలుగా కోసుకొని, గింజల్ని తీసేసి రడీగా ఉంచుకోవాలి. పాలు సగం అయ్యాక పంచదారని కలిపి మొత్తం కరిగేదాకా తిప్పాలి. సపోటా పళ్ల ముక్కల్ని వేసి మరో రెండు మూడు నిమిషాలు స్టౌ పైనే ఉంచాలి. సపోటాలు చిన్న చిన్న ముక్కలు కాకుండా చూసుకోవాలి. దించాక ఈ ఖీర్‌ను కుంకుమ పువ్వుతో అలంకరించాలి. వేడి తగ్గాక, ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







