ఉమ్రా ట్రిప్‌తో బస్ డ్రైవర్స్‌కి ఆర్టీఏ 'బహుమతి'
- May 20, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, ఉమ్రా ట్రిప్‌ని 15 మంది పబ్లిక్ బస్ డ్రైవర్స్‌కి బహుమతిగా ఇచ్చింది. వారిలో ఆనందోత్సాహాల్ని నింపింది. ఆర్టిఎలోని ఓ సెగ్మెంట్‌కి ప్రత్యేక గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్ అలీ వెల్లడించారు. ఎంపిక చేయబడిన డ్రైవర్లుకి ఏజెన్సీ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరీ ఉమ్రాకి పంపారు. అలాగే, వారికి మంచి హోటల్లో అకామడేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటివి ఏర్పాటు చేశామని అలి చెప్పారు. ఉమ్రా గతంలో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా నిర్వహించినవారికి, ఐదేళ్ళ నుంచి వారి కెరీర్ కండక్ట్‌ని పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టారు. హోలీ సైట్స్ నుంచి తిరిగి వచ్చిన డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ మరియు ఎంప్లాయీస్, డ్రైవర్ల మధ్య సంబంధాలు ఇంకా బలోపేతమయ్యేందుకు ఇలాంటివి ఉపయోగపడ్తాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







