ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం జగన్…

- September 26, 2023 , by Maagulf
ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం జగన్…

అమరావతి: మంగళవారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై సమీక్షా నిర్వహించారు సీఎం జగన్. రానున్న రోజుల్లో నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాల‌పై రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు జ‌గ‌న్‌ దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసారు.

ఈ సారి టికెట్లు కొందరికి రావచ్చు, మరికొందరికి రాకపోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. టికెట్ దక్కని వారు నా వాళ్లు కాకుండా పోరని వారికి ఏదో ఒక పదవి ఇస్తామని వెల్లడించారు. టికెట్ల విషయంలో అందరు తన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలం మరో ఎత్తు అని తెలిపారు. వచ్చే 6 నెలలు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, మనం గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్ వైసీపీ పార్టీ నాయకులకు సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలవాలని కోరారు. అయితే జగన్ వ్యాఖ్యలకు చాలామంది ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారు. ఎవరికీ టికెట్ ఇస్తారు..? ఎవరి కి ఎవ్వరు అనేది అర్థంకాక అయోమయం అవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com