తెలంగాణలో విషాదం..8 మంది పై పిడుగుపాటు
- September 26, 2023
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఖమ్మం జిల్లాలో విషాదం నింపాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి (మం) దమ్మాయిగూడెంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న 8 మంది కూలీలపై పిడుగు పడింది.
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో కూలీలంతా పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో 8 మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం ఉండగా.. మిగతా వారికి గాయాలు అయినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







