రష్మిక మండన్నా ‘యానిమల్’.! కొత్తగా సరికొత్తగా.!
- September 27, 2023
రష్మిక మండన్నా ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని హిందీలో తెరకెక్కించి అక్కడా సూపర్ సెన్సేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత బాలీవుడ్లోనే సెటిలైపోయాడు సందీప్ రెడ్డి. ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రమే ‘యానిమల్’. రణ్వీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సినిమాలోని క్యారెక్టర్లను ఒక్కొక్కరుగా పరిచయం చేస్తున్నారు ‘యానిమల్’ టీమ్.
ఈ పరిచయం ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. ‘యానిమల్’ అసలు సోల్ ఏంటీ.? ఏ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.. అనే అంశంపై అంతకంతకూ ఆసక్తి రేకెత్తుతోంది.
ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మండన్నా క్యారెక్టర్ చాలా కొత్తగా వుండబోతోందట. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో నిండైన చీరకట్టులో ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది రష్మిక మండన్నా.
ఇంతవరకూ బాలీవుడ్లో రష్మిక చేసిన సినిమాలు ఓ ఎత్తు.. ఈ సినిమా ఇంకో ఎత్తు అనేలా వుండబోతోందట. ఈ సినిమా హిట్ అయితే, రష్మిక బాలీవుడ్‌లోనూ స్టార్డమ్ సంపాదించుకోవడం పక్కా అంటున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







