‘లియో’ ఆడియో ఫంక్షన్ రద్దు.! ఆ కారణం నిజమేనా.?
- September 27, 2023
విజయ్ హీరోగా రూపొందుతోన్నప్రతిష్టాత్మక చిత్రం ‘లియో’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 30న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ ఫంక్షన్ రద్దయ్యిందని అంటున్నారు.
అందుకు కారణంగా నిర్మాణ సంస్థ.. ఈ ఆడియో ఫంక్షన్‌కి ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయ్. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఫంక్షన్ వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అయితే, ఈ కారణం ఎంత వరకూ నిజం.?
ఆడియో ఫంక్షన్ వాయిదాకి సంబంధించి తమపై ఎలాంటి రాజకీయ పార్టీల ఒత్తిడి లేదంటూ క్లారిటీ కూడా ఇచ్చింది. దాంతో దీని వెనక ఏదో బలమైన కారణమే వుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
నిజంగానే ఏదో రాజకీయ శక్తుల బలవంతంపైనే ఆడియో ఫంక్షన్ వాయిదా వేసి వుంటారని అనుకుంటున్నారు. గతంలోనూ ఎంతో మంది స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్లు జరిగాయ్. లెక్కకు మించి అభిమానులు రావడం జరిగింది. కానీ, దాన్ని ఓ కారణంగా చెప్పి, ఆడియో ఫంక్షన్ ఆపేయడం అనేది ఒకింత ఆశ్చర్యకరంగానూ, ఆలోచించే విధంగానూ వుంది.
ఏది ఏమైతేనేం, అభిమానుల్లో ఆడియో ఫంక్షన్ విషయమై నెలకొన్న గందరగోళానికి అధికారికమైన క్లారిటీ అయితే ఇచ్చేసింది ‘లియో’ టీమ్. అయితే, ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూ వుంటామని చెబుతున్నారు.
త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







