విజయవంతంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్న 'జంధ్యాల గారి జాతర 2.0'
- September 29, 2023
హైదరాబాద్: సన్ స్టూడియో బ్యానర్ పై, శ్రీనిధి క్రియేషన్స్ సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం 'జంధ్యాల గారి జాతర 2.0' ఈరోజు అతిరథమహారధులు మధ్య విజయవంతంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. థర్టీ ఇయర్స్ పృద్వి హీరో హీరోయిన్ ల నడుమ మొదటి సీన్ కు యాక్షన్ చెప్పారు.
ఈ సందర్భంగా కమెడియన్ పృద్వి మాట్లాడుతూ.. ఈరోజు మంచిరోజని, సినిమా టైటిల్ చూడగానే చాలా అద్భుతంగా అనిపించిందని అన్నారు. ఫుల్ లెన్త్ కామెడీ చిత్రాంగా తెలుగు పరిశ్రమలో ఒక ముద్ర వేసుకుంటుంది అని చెప్పారు. హీరో క్రిష్, హీరోయిన్ కష్వీలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన కూతురు శ్రీలు కూడా ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ వాల్మీకి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని పేర్కొన్నారు.
పూర్తి హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వాల్మీకి తెలిపారు. ఈ సినిమాకు జంధ్యాల గారి పేరు పెట్టడంతో ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడుతాయని, అయితే ఈ సినిమా కచ్చితంగా అందరి అంచనాలను ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో క్రిష్ సిద్దిపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జంధ్యాల గారి జాతర చిత్రం విడుదల తర్వాత కచ్చితంగా ప్రేక్షకులకు హాస్య జాతర పరిచయం అవుతుందని చిత్ర దర్శకుడు వాల్మీకి వెల్లడించారు.
ఈ సందర్భంగా హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ.. సినిమా ఆధ్యాంతం హాస్య భరితంగా ఉంటుందని, ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా అని పేర్కొన్నారు.
నటుడు రఘుబాబు మాట్లాడుతూ ఉత్సాహమైన మేకర్స్ తో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. చిత్రం టైటిల్ చాలా బాగుందని సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆనందింప చేస్తుందని తెలిపారు. సినిమాలో తనతో పాటు టాప్ కమెడియన్స్ అందరూ నటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే చిత్ర దర్శకనిర్మాతలకు రఘుబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో క్రిష్ సిద్దిపల్లి, హీరోయిన్ కష్వీ, కమెడియన్ పృద్వి, నటుడు రఘుబాబు, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు: క్రిష్ సిద్ధిపల్లి, కాష్వీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సత్య, పృద్వి, అజయ్ గోష్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ప్రిన్స్, నాగినీడు, పవిత్ర నరేష్, పూర్ణ, సురేఖ వాణి, దువ్వాసి మోహన్, శ్రీలు తదితరులు
బ్యానర్: సన్ స్టూడియో
సమర్పణ: శ్రీ నిధి క్రియేషన్స్
రచన దర్శకత్వం: వాల్మీకి
నిర్మాత: సన్ స్టూడియో
సహానిర్మాత: నిఖిల్ యనమల, బీవీ నవీన్
సంగీత దర్శకుడు: వంశీ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: విజయ్ ఠాగూర్
ఎడిటర్: అనిల్ కుమార్ పీ
కొరియోగ్రాఫీ: యాని మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: నారాయణ రావ్ ఎమ్
డైలాగ్స్ : పూలుర్ ఘటికచలం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేఖర్ అలవలపటి
ఫైనాన్స్ కంట్రోలర్ : భాషా షైక్
పబ్లిసిటీ డిజైనర్: టీఎసెఎస్ కుమార్
పీఆర్ఓ: హరీష్, దినేష్
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







