సౌదీలో 8.3%కి తగ్గిన నిరుద్యోగ రేటు

- September 30, 2023 , by Maagulf
సౌదీలో 8.3%కి తగ్గిన నిరుద్యోగ రేటు

రియాద్: సౌదీలో నిరుద్యోగిత రేటులో తగ్గుదల నమోదు అయింది.  ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.5 శాతంతో పోలిస్తే 2023 రెండవ త్రైమాసికంలో 8.3 శాతానికి చేరుకుంది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన తాజా గణాంకాలను వెల్లడించింది. గురువారం తన అధికారిక వెబ్‌సైట్ www.stats.gov.saలో ప్రచురించిన లేబర్ మార్కెట్ బులెటిన్‌లో మొత్తం నిరుద్యోగం రేటును ప్రకటించింది. ఇందులో సౌదీలు,  ప్రవాసులు ఇద్దరినీ కవర్ చేసారు. 2023 రెండవ త్రైమాసికంలో 4.9 శాతానికి తగ్గింది.

గణాంకాల ప్రకారం.. సౌదీ మహిళల్లో నిరుద్యోగం రేటు 2023 రెండవ త్రైమాసికంలో తగ్గింది. ఇది మునుపటి త్రైమాసికంలో 16.1 శాతంతో పోలిస్తే 15.7 శాతానికి చేరుకుంది. అయితే సౌదీ పురుషుల నిరుద్యోగం రేటు 2023 రెండవ త్రైమాసికంలో 4.6 శాతానికి చేరింది. 2023 మొదటి త్రైమాసికంతో పోల్చితే సౌదీలు.. సౌదీయేతరులలో మొత్తం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 60.8 శాతానికి చేరుకుంది.   మొత్తం సౌదీల సంఖ్య నిరుద్యోగం రేటు 2023 రెండవ త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. ఇది 2022 రెండవ త్రైమాసికంలో 9.7 శాతంతో పోలిస్తే 8.3 శాతానికి చేరుకుంది. సౌదీ పురుషుల నిరుద్యోగిత రేటులో తగ్గుదల 2023 రెండవ త్రైమాసికంలో 4.6 శాతానికి చేరుకుంది. గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో 4.7 శాతంగా ఉంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com