సౌదీలో 8.3%కి తగ్గిన నిరుద్యోగ రేటు
- September 30, 2023
రియాద్: సౌదీలో నిరుద్యోగిత రేటులో తగ్గుదల నమోదు అయింది. ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.5 శాతంతో పోలిస్తే 2023 రెండవ త్రైమాసికంలో 8.3 శాతానికి చేరుకుంది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన తాజా గణాంకాలను వెల్లడించింది. గురువారం తన అధికారిక వెబ్సైట్ www.stats.gov.saలో ప్రచురించిన లేబర్ మార్కెట్ బులెటిన్లో మొత్తం నిరుద్యోగం రేటును ప్రకటించింది. ఇందులో సౌదీలు, ప్రవాసులు ఇద్దరినీ కవర్ చేసారు. 2023 రెండవ త్రైమాసికంలో 4.9 శాతానికి తగ్గింది.
గణాంకాల ప్రకారం.. సౌదీ మహిళల్లో నిరుద్యోగం రేటు 2023 రెండవ త్రైమాసికంలో తగ్గింది. ఇది మునుపటి త్రైమాసికంలో 16.1 శాతంతో పోలిస్తే 15.7 శాతానికి చేరుకుంది. అయితే సౌదీ పురుషుల నిరుద్యోగం రేటు 2023 రెండవ త్రైమాసికంలో 4.6 శాతానికి చేరింది. 2023 మొదటి త్రైమాసికంతో పోల్చితే సౌదీలు.. సౌదీయేతరులలో మొత్తం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 60.8 శాతానికి చేరుకుంది. మొత్తం సౌదీల సంఖ్య నిరుద్యోగం రేటు 2023 రెండవ త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. ఇది 2022 రెండవ త్రైమాసికంలో 9.7 శాతంతో పోలిస్తే 8.3 శాతానికి చేరుకుంది. సౌదీ పురుషుల నిరుద్యోగిత రేటులో తగ్గుదల 2023 రెండవ త్రైమాసికంలో 4.6 శాతానికి చేరుకుంది. గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో 4.7 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







