జాతీయ క్రీడా పోటీల్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సత్తా
- September 30, 2023
హైదరాబాద్: గుజరాత్ లోని బరోడాలో ఇటీవల జరిగిన 2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఉద్యోగులు రెండు పతకాలను సాధించారు.
బాడ్మింటన్ విమెన్స్ డబుల్ కేటగిరిలో రన్నర్ అప్స్ గా టీఎస్ఆర్టీసీకి చెందిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి నిలిచారు. వారు సిల్వర్ మెడల్ సాధించారు. బాడ్మింటన్ విమెన్స్ టీం చాంపియన్ కేటగిరిలో టీఎస్ఆర్టీసీ రన్నర్ ఆప్స్ గా నిలిచింది. ఈ కేటగిరిలో ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలు సిల్వర్ మెడల్ గెలుపొందారు.
2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హర్షం వ్యక్తం చేశారు.
పతకాలు సాధించిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలను బస్ భవన్‌లోని తన ఛాంబర్లో శనివారం ఆయన అభినందించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. క్రీడల్లో ఆసక్తిగా ఉన్న ఉద్యోగులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇ.డి (ఎ,ఎం, పి అండ్ ఎ.ఎం) కృష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, కోచ్ ఏవీవీ రామరాజు, మేనేజర్ ఎండీ అన్సర్ అలీ, ఫిజియో హిమన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







