మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ముర్ము సంతకం
- September 30, 2023
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదం పొందింది. పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. లోక్‌సభ, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఉభయసభలు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు కేంద్రం 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే జనాభా లెక్కల తర్వాత చేపట్టే డీలిమిటేషన్ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేసే తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
మహిళా రిజర్వేషన్ల బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అధికారికంగా 106వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఇప్పుడు రాజ్యాంగ (106వ సవరణ) చట్టంగా మారింది. లోక్‌సభలో ఈ బిల్లుకు ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మినహా అందరూ మద్దతు పలికారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







