నివాసితులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేసే 3 ప్రధాన ప్రాజెక్ట్‌లు
- September 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ లో నివసించే పౌరులు, నివాసితులు.. పొరుగు దేశాలకు సులభంగా వెళ్లేలా త్వరలో మూడు ప్రధాన రవాణా ప్రాజెక్టులు రానున్నాయి. ఇవి నేల, సముద్రం మీదుగా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
ఇండియాకు రైలు ప్రయాణం
ఇటీవల ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో మధ్యప్రాచ్యం, దక్షిణాసియా మధ్య రైల్వే కారిడార్ కోసం చర్చించారు. కొత్త కారిడార్‌లో ఓడరేవులతోపాటు రైల్వే వ్యవస్థ కూడా ఉంటుందని తెలిపారు. అమెరికా, సౌదీ అరేబియా, భారతదేశం, యూరోపియన్ యూనియన్, యూఏఈలను కలుపుతూ రైలు, ఓడరేవులను ఒప్పందంలో భాగంగా నిర్మించనున్నారు. కొత్త కారిడార్‌లో ఓడరేవులు, రైల్వేలు, మెరుగైన రోడ్లు మరియు పవర్, గ్యాస్ గ్రిడ్లు మరియు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌లు ఉంటాయని లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఔసాఫ్ సయీద్ వెల్లడించారు.
GCC రైల్వే
ఆరు జిసిసి (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) సభ్య దేశంలోని కీలక నగరాలను కలిపే 2,117కిమీ జిసిసి రైల్వే ట్రాక్‌లో భాగంగా ఉంది. దీనిపై అధ్యయనాలు పూర్తయ్యాయి. ప్రాంతీయ రోల్అవుట్ త్వరలో కార్యరూపం దాల్చుతుందని అధికారులు ఈ ఏడాది మధ్యలో అబుధాబిలో జరిగిన రైలు సదస్సులో జిసిసి రైల్వే అథారిటీ నిపుణుడు నాజర్ అల్ఖహ్తానీ తెలిపారు. ప్రాజెక్ట్‌లో యూఏఈ, సౌదీ అరేబియా ముందున్నాయి. యూఏఈలో 900km జాతీయ నెట్వర్క్ పూర్తయింది . ఎతిహాద్ రైల్ వాణిజ్య సరుకు రవాణా సేవలు ఫిబ్రవరి నుండి పూర్తిగా పని చేస్తున్నాయి. సౌదీ అరేబియాలో 200-కిమీ రస్ అల్ ఖైర్-దమ్మన్ మార్గం జుబైల్ గుండా పూర్తయింది.
యూఏఈ-భారతదేశం మధ్య సముద్రయానం
యూఏఈ- దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ మధ్య ప్రయాణీకుల సముద్రాయానం త్వరలో ప్రారంభం కానుంది. భారతీయ ప్రవాసులు ఈ చౌకైన ప్రయాణ విధానం నుండి ప్రయోజనం పొందడం ఖాయం. ఎందుకంటే టిక్కెట్ల ధర వన్ వే Dh442 నుండి మొదలవుతుంది. ఈ ఏడాది డిసెంబరులో పాఠశాల విరామానికి ముందు ఈ సేవను ప్రారంభించి, అమలు చేయాలనే ఆలోచన ఉందని ఇండియన్ అసోసియేషన్ షార్జా అధ్యక్షుడు YA రహీమ్ తెలిపారు. అనంతపురి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో షార్జా ఇండియన్ అసోసియేషన్ ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







