ఓవర్ హీటింగ్, కలర్ ఛేంజ్.. ఐఫోన్ 15పై వినియోగదారుల ఫిర్యాదులు
- October 01, 2023
యూఏఈ: కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఐఫోన్ 15పై వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ ఫోన్ విడుదలైన విషయం తెలిసిందే.కాగా సెప్టెంబర్ 22న యూఏఈలో కస్టమర్‌లకు అందుబాటులోకి వచ్చింది. దుబాయ్‌లోని మాల్స్‌తో ఇది హాట్‌కేక్‌గా అమ్ముడుపోయింది.
ఇదిలా ఉండగా.. ఆపిల్ ఐఫోన్ 15పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు మల్టీఫుల్ సమస్యలను నివేదిస్తున్నారు. ఐఫోన్ 15 - ప్రో మరియు ప్రో మాక్స్ - వేరియంట్‌ల గురించి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. టెక్ దిగ్గజం వారి కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ సమస్యపై చాలా ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. ఆపిల్ ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అది ఐఫోన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు.
సమాచార బదిలీ
కొంతమంది ఐఫోన్ వినియోగదారులు తమ పాత ఐఫోన్ నుండి కొత్తదానికి తమ డేటాను బదిలీ చేయడంలో సమస్య ఉందని నివేదించారు. టెక్ దిగ్గజం వెంటనే iOS 17.0.2 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను జారీ చేసింది. అయితే సమస్యలు పూర్తిగా తొలిగిపోలేదు. వినియోగదారులు ఫోన్ ని డివైస్ ఫర్మ్‌వేర్ అప్‌డేట్ మోడ్‌లో ఉంచాలని మరియు కంప్యూటర్‌ను ఉపయోగించి దాన్ని పునరుద్ధరించాలని ఆపిల్ తెలిపింది.
టైటానియం ఫ్రేమ్ రంగు మారుతోంది
కొంతమంది వినియోగదారులు టైటానియం ఫ్రేమ్, కొత్త ఫీచర్, రంగు మారుతున్నట్లు నివేదించారు. వేలిముద్రలు మెటల్ రంగు మారడానికి కారణమవుతాయని ఆపిల్ స్వయంగా పేర్కొంది. అలాంటి సమయంలో గాడ్జెట్‌ను తడిగా ఉన్న మెత్తని గుడ్డతో తుడవడం ద్వారా అసలు రంగును పునరుద్ధరించవచ్చ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







