టీడీపీ ‘మోత మొగిద్దాం’ పిలుపు అపూర్వ స్పందన
- October 01, 2023
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా టీడీపీ ఇచ్చిన ‘మోత మొగిద్దాం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిన. ఏపీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి..మోత మోగించారు. ప్లేట్స్ ఫై సౌండ్ చేయడం..విజిల్ చేయడం ..డ్రమ్స్ కొట్టడం వంటివి చేసి తమ సంఘీభావం తెలిపారు. నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఢిల్లీ లో మోత మోగించగా..నారా బ్రహ్మణి రాజమండ్రి లో , నారా భువనేశ్వరి హైదరాబాద్ లో మోత మోగించారు.
రాజమండ్రిలో లోకేష్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో జనాలతో కలిసి బ్రాహ్మణి పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుపడుతు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఈలలతో మోత మోగించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్ధతుగా డబ్బులు, ఈలలతో మోత మోగించారు. సరిగ్గా 7 గంటలకు క్యాంపు కార్యాలయం బయట వీరంతా ఈలలు, డప్పుల శబ్ధాలు చేశారు. కంచాలు కొడుతూ, విజిల్స్, బూరెలు ఊదుతూ చంద్రబాబుకు తమ మద్ధతు ప్రకటించారు టీడీపీ శ్రేణులు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







