2023లో మరో లాంగ్ వీకెండ్ రానుందా?
- October 02, 2023
యూఏఈ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ప్రస్తుతం ప్రవక్త మహమ్మద్ (స) పుట్టినరోజు సందర్భంగా మూడురోజుల లాంగ్ వీకెండ్ వచ్చింది. సోమవారం నుంచి వర్క్‌వీక్‌ని పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, అధికారిక సెలవుల జాబితా ప్రకారం తదుపరి సెలవులు యూఏఈ జాతీయ దినోత్సవం డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో(శనివారం, ఆదివారం) వస్తుంది. దీంతోపాటు గతంలో అమరవీరుల దినోత్సవంగా పిలిచే యూఏఈ సంస్మరణ దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 1న జరుపుకుంటారు. 2023లో ఈ సందర్భం శుక్రవారం నాడు వస్తుంది. అయితే, దీనిని 2023కి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాలో చేర్చలేదు. గతంలో ఉద్యోగులకు స్మారక దినోత్సవంనాడు సెలవు ప్రకటించారు. ఈసారి అలాగే ప్రకటిస్తే.. 2023లో మరో వీకెండ్ అవుతుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR), మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) నుండి అధికారిక ప్రకటనల ద్వారా ఖచ్చితమైన సెలవుల సంఖ్య తెలుస్తుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







