వెహికల్ ఇన్‌స్పెక్షన్ కు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తప్పనిసరి

- October 02, 2023 , by Maagulf
వెహికల్ ఇన్‌స్పెక్షన్ కు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తప్పనిసరి

జెడ్డా: అన్ని రకాల వాహనాలకు పిరియాడిక్ టెక్నికల్ ఇన్ స్పెక్షన్ (ఫహాస్) కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి అని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని మోటార్ వెహికల్ పీరియాడిక్ ఇన్‌స్పెక్షన్ (MVPI) విభాగం చెప్పింది. వివిధ రకాల వాహనాల యజమానులు ఏదైనా MVPI స్టేషన్‌కు వెళ్లే ముందు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది.  వ్యక్తిగత డేటా, వాహన డేటాను నమోదు , తనిఖీ రకం, తనిఖీ ప్రాంతం, MVPI కేంద్రాన్ని ఎంచుకోవడం, ఆపై అవసరమైన తేదీ మరియు సమయాన్ని నమోదు చేయడం ద్వారా అపాయింట్‌మెంట్ బుకింగ్ చేసుకోవాలని సూచించింది.  సౌదీ అరేబియాలో వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. మోటారు వాహనాలు సురక్షితంగా ఉన్నాయని, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం దీని లక్ష్యం. MVPI బృందం వాహనం ఆయిల్ లీకేజీ, స్టీరింగ్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్, ఛాసిస్, బ్రేక్‌లు, లైట్లు, టైర్లు, ఉద్గార నియంత్రణ వ్యవస్థ మొదలైనవాటిని తనిఖీ చేస్తుంది. ఏదైనా లోపాలు కనుగొనబడితే వాహనం తనిఖీలో ఉత్తీర్ణత సాధించదు. దానిని సరిదిద్దిన తర్వాత మళ్లీ తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com