మోదీకి అరుదైన రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకనున్న అమెరికా ప్రభుత్వం
- May 21, 2016
జూన్ 8న యూఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసగించడానికి వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరచి అత్యంత అరుదుగా ఇచ్చే స్పీకర్ విందుకు ఆహ్వానించనుంది. కాంగ్రెస్ ను ఉద్దేశించి మోదీ ఇచ్చే ప్రసంగంలో అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ తో పాటు కేబినెట్ మంత్రులు హాజరుకానున్నారు.
ఇందుకోసం అధ్యక్షుడు బరాక్ ఒబామా, సెనేటర్లు మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 8న జరిగే ఈ కార్యక్రమంతో పాటు పలు ఈవెంట్లతో మోదీ బిజీగా గడపనున్నారు. మొదట స్పీకర్ ఇచ్చే విందుకు మోదీ హాజరవుతారు. తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గతంలో మన్మోహన్ సింగ్, అటల్ బిహారి వాజ్ పేయి, పీవీ నరసింహారావులు మాత్రమే కాంగ్రెస్ జాయింట్ మీటింగ్ లో సభను ఉద్దేశించి ప్రసగించారు.
తాజా వార్తలు
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్
- విజయవాడ ‘వివేకానంద’లో సమ్మర్ క్యాంప్!
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!









