అక్రమంగా నివసించే ఫిలిగ్రిమ్స్‌పై కఠిన చర్యలు
- May 21, 2016
ఫిలిగ్రిమ్స్ అక్రమంగా నివసించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు హెచ్చరించాయి. భారీ మొత్తంలో జరీమానా, అలాగే జైలు శిక్ష విధించబడ్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు ఈ విషయాల్ని వివరిస్తూ, వీసా గడువు కన్నా ఎక్కువ రోజులు నివసించే ఫిలిగ్రిమ్స్‌కి 50,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధింపబడ్తుందనీ, వీటి అనంతరం దేశం నుంచి పంపివేయబడ్తారనీ చెప్పారు. స్థానికులు, ఫిలిగ్రిమ్స్‌కి అక్రమంగా నివసించేందుకు అవకాశమిస్తే వారికి 100,000 సౌదీ రియాల్స్, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని చెప్పారాయన. ఏదైనా సంస్థ ఫిలిగ్రిమ్స్‌కి సంబంధించి సరైన సమాచారం ఇవ్వని పక్షంలో 100,000 జరీమానాతోపాటు, ఆ ఫిలిగ్రిమ్స్ బాధ్యత తీసుకున్న సంస్థని బ్లాక్ లిస్ట్ చెయ్యడం జరుగుతందనీ, వాటితోపాటుగా కంపెనీ మేనేజర్‌కి ఏడాదిపాటు జైలు శిక్ష తప్పదని, ఒకవేళ అతను వలసదారుడైతే జైలు శిక్ష పూర్తయిన వెంటనే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఉమ్రా సందర్భంగా నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







