యూఏఈలో 'రింగ్ ఆఫ్ ఫైర్' కనిపిస్తుందా?
- October 03, 2023
యూఏఈ: అక్టోబర్ 14 న సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సందర్భంగా చంద్రుడు సూర్యుని ముందుకు వచ్చి దానిని పాక్షికంగా కప్పివేస్తాడు. దీంతో సూర్యకాంతి అద్భుతమైన వలయాన్ని సృష్టిస్తుంది. దీనినే 'రింగ్ ఆఫ్ ఫైర్' అంటారు. అయితే, ఈసారి దీనిని చూడాలంటే మాత్రం అమెరికా వెళ్లాల్సిందే. ఎందుకంటే 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం అరబ్ ప్రాంతంలో కనిపించే అవకాశం లేదని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరీరి తెలిపారు. గతంలో ఈ అద్భుత దృశ్యం యూఏఈలో కనిపించిందని గుర్తుచేశారు. సూర్యగ్రహణం యూఎస్ పశ్చిమ తీరంతో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. కానీ రింగ్ ఆఫ్ ఫైర్ ని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ యూట్యూబ్ ఛానెల్‌తో పాటు ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







