ఏపీలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- October 03, 2023
కొవ్వలి: అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కొవ్వలిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కొవ్వలి గ్రామంలో ఏలూరు హేలాపురి రూరల్ లయన్స్ క్లబ్, వెంగి జెమ్స్ లయన్స్ క్లబ్, ఏలూరు ఆయుష్ హాస్పిటల్స్ నాట్స్ ఉచిత వైద్య శిబిర నిర్వహణకు సహాయ సహకారాలు అందించాయి. నాట్స్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉపాధ్యక్షుడు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చొరవతో ఏర్పాటైన ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మంది పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవ్వలి గ్రామంలో పేద రోగులందరికి షుగర్, బీపీ, గుండె, కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చక్కటి సమన్వయంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నాట్స్ దిగ్విజయంగా నిర్వహించి స్థానికుల ప్రశంసలు పొందింది. పేద రోగులకు నాట్స్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని స్థానికులు అభినందించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ నాయకుడు భాను ధూళిపాళ్ల చేసిన కృషిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రశంసించారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదాన్ని చేతల్లో చూపించిన భాను ప్రకాశ్ ధూళిపాళ్లను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అభినందించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







