భారత్‌లో 5జి పై మోజు
- October 03, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి భారత్‌లో 5జి వినియోగదారులు 3.1 కోట్లకు చేరొచ్చని ఎరిక్సన్ సర్వేలో వెల్లడయ్యింది. 5జికి డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు రెండు గంటలు ఎక్కువగా 5జి సర్వీస్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఎరిక్సన్ సర్వే ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 లక్షల నుంచి కోటి మంది 5జి వినియోగదారులున్నారని అంచనా వేసింది. ఎక్కువ మంది 5జి డేటాను హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్, మొబైల్ గేమ్‌లు ఆడేందుకు ఉపయోగిస్తున్నారు. 15 శాతం మంది యాప్ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మ్యూజిక్ వంటి సర్వీస్‌లతో కూడిన 5జి డేటా ప్లాన్లకు ప్రస్తుత ధర కంటే 14 శాతం ఎక్కువ చెల్లించడానికి సిద్దంగా ఉన్నారు. భారత్‌లో గతేడాది అక్టోబర్‌లో పలు ప్రయివేటు టెల్కోలు 5జి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







