బ్యాంకాక్‌లో కాల్పుల ఘటన.. పౌరులకు యూఏఈ సలహా
- October 04, 2023
యూఏఈ: థాయ్‌లాండ్ రాజధాని నగరాన్ని కుదిపేసిన మాల్‌లో కాల్పుల ఘటనతో బ్యాంకాక్‌లోని యూఏఈ ఎంబసీ మంగళవారం ఒక సలహా జారీ చేసింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎమిరాటీలందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు (0930 GMT) కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. దీంతో వందలాది మంది ప్రజలు బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న సియామ్ పారాగాన్ మాల్ నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు థాయ్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ ఎంబసీ నగరంలోని పౌరులకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాట్‌లైన్ 0097180024ను సంప్రదించాలని ఎమిరాటీస్‌ను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







