రష్మిక ఖాతాలో మరో బాలీవుడ్ ప్రాజెక్ట్.!
- October 04, 2023
నేషనల్ రష్మిక మండన్నా ఖాతాలో మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేరింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రస్తుతం రష్మిక మండన్నా ‘యానిమల్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అంచనాలు కూడా బాగున్నాయ్. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మండన్నా పాత్ర కూడా అద్భుతంగా వుండబోతోందనీ తెలుస్తోంది.
ఈ సినిమా రిలీజ్ కాకుండానే, మరో ప్రెస్జీజియస్ ప్రాజెక్ట్ రష్మిక చేతికి చిక్కింది. వివరాలు పూర్తిగా తెలియాల్సి వుంది. అన్నట్లు కత్రినా కైఫ్ భర్త అయిన విక్కీ కౌషల్.. సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తుంటాడు. ఆయన సినిమాల్లో ఏదో ఒక మ్యాజిక్ వుంటుంది.
మరి, రష్మికకు ఆ మ్యాజిక్ కలిసొస్తే బాలీవుడ్‌లో రష్మిక కెరీర్‌కి ఇక తిరుగే వుండదు. అలాగే, ‘యానిమల్’ హిట్టయినా రష్మిక మండన్నా ఇక, బాలీవుడ్‌లో తిష్ట వేసేయడం ఖాయం. తెలుగులో రష్మిక ‘పుష్ప 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









