గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలెర్ట్

- October 04, 2023 , by Maagulf
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలెర్ట్

యూఏఈ: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అలెర్ట్ జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో అత్యవసర భద్రతా సమస్యలను గుర్తించినట్లు తన ట్విటర్ అకౌంట్లో (ఎక్స్)లో వెల్లడించింది. ఇది అప్లికేషన్ క్రాష్‌లు లేదా ఏకపక్ష కోడ్ కరెక్షన్ కు దారితీయవచ్చని పేర్కొంది. "గూగుల్ బ్రౌజర్‌లో CVE-2023-5217 అనే క్లిష్టమైన భద్రతా బగ్ ను పరిష్కరించడానికి క్రోమ్  117.0.5938.132 వెర్షన్‌ను ఇటీవల విడుదల చేసింది." అని పేర్కొంది.

గూగుల్  నుండి ఇటీవల విడుదల చేసిన సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా నివాసితులను సిఫార్సు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమాచారాన్ని వారి కంపెనీలు,  వ్యాపార భాగస్వాములతో పంచుకోవాలని సూచించింది. లైనక్స్, మైక్రోసాఫ్ట్, మాక్ ఓఎస్ అకు అప్‌డేట్ లు అందుబాటులో ఉన్నవి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com