2034 ప్రపంచకప్‌ను నిర్వహణకు సౌదీ బిడ్
- October 05, 2023
రియాద్: సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) నేతృత్వంలో 2034 ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ వేయనున్నట్లు సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. దేశంలో సామాజిక, ఆర్థిక పరివర్తన , ఫుట్‌బాల్ పట్ల అభిరుచిరని పెంచడం ఈ బిడ్ లక్ష్యమని తెలిపింది. సౌదీ అరేబియా 2018 నుండి 50కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్, మోటార్‌స్పోర్ట్స్, టెన్నిస్, ఈక్వెస్ట్రియన్, ఎస్పోర్ట్స్, గోల్ఫ్ ఈవెంట్లు ఉన్నాయి. ఆరుసార్లు FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించి, ఇటీవల 2022లో గ్రీన్ ఫాల్కన్స్(సౌదీ) తమ గ్రూప్ మ్యాచ్‌లో చాంపియన్ అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 2022లో ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ లో జరిగింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







