దుబాయ్ మిరాకిల్ గార్డెన్: ఈ సీజన్లో ప్రవేశ టిక్కెట్ ధరలు తెలుసా?
- October 05, 2023
దుబాయ్: దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో ఐకానిక్ పూల ఆకర్షణలు మరోసారి సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ప్రసిద్ధ శీతాకాలపు ఆకర్షణ గత వారాంతంలో 12వ సీజన్ కోసం తిరిగి ప్రారంభమైంది. ప్రవేశ టిక్కెట్ల ధరలను అప్డేట్ చేశారు. అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నా సమాచారం ప్రకారం పెద్దలకు (12 ఏళ్లు పైబడిన వారికి) వ్యక్తిగత ప్రవేశ ధర Dh95, 3 - 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు Dh80గా నిర్ణయించారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దృఢ సంకల్పం ఉన్నవారికి ఉచిత ప్రవేశం కల్పించారు. వారి వెంట ఉండే వారికి టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ కల్పించారు. గత సంవత్సరం టిక్కెట్ ధరలు పెద్దలు, వృద్ధులకు Dh75, 3 నుండి 12 సంవత్సరాల పిల్లలకు Dh60గా ఉండే.
150 మిలియన్లకు పైగా పువ్వులు
దుబాయ్ల్యాండ్లో ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఫిబ్రవరి 14, 2013న ప్రేమికుల రోజున మొదటిసారి ప్రారంభించినప్పటి నుండి నివాసితులు, పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించవలసిన గమ్యస్థానంగా కొనసాగుతోంది. ఇందులో 150 మిలియన్లకు పైగా పుష్పాలను ప్రదర్శనకు పెట్టారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది. వారాంతాల్లో (శుక్రవారం, శనివారం), ప్రభుత్వ సెలవు దినాల్లో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతిరోజూ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ బస్ స్టేషన్ మరియు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ మధ్య పబ్లిక్ బస్సులు (రూట్ 105) ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







