‘దేవర’ రెండు పార్టులు.! ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.!
- October 05, 2023
ఎన్టీయార్ 30 వ చిత్రంగా తెరకెక్కుతోన్న సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ‘దేవర’ను ఒక్క పార్ట్ కాదు, రెండు పార్టులుగా రూపొందిస్తున్నారట.. అంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారం నిజమే అని తేలింది. స్వయంగా డైరెక్టర్ కొరటాల శివ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. సినిమా చాలా బాగా వస్తోంది. డైలాగులు తగ్గించలేం. సీన్లు కట్ చేయలేం. సో, సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనుకుంటున్నామని తాజాగా వివరణ ఇచ్చేశారు.
ఇంకేముంది.! ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి పండగే పండగ. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎన్టీయార్ అభిమానులు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీయార్ నుంచి వస్తున్న చిత్రమిది. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.
ఎన్టీయార్ అన్ని విషయాల్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారీ సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని. అద్భుతమైన అవుట్ పుట్ వస్తోందని మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







