బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు మృతి
- October 05, 2023
తమిళనాడు: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బాణాసంచా తయారీలో పేలుడు సంభవించడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళికి నెల రోజులు మాత్రమే ఉండడంతో ఆ ప్రాంతానికి చెందిన కార్మికులు పటాకుల తయారీలో నిమగ్నమయ్యారు. ఉత్పత్తి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, తయారు చేస్తున్న పేలుడు పదార్థాలు పెద్ద శబ్దంతో పేలి నలుగురు కార్మికులు మరణించారు. సుమారు 100 మీటర్ల మేర మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులు గుర్తించలేకపోయారు. "ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎనిమిది మంది ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్పీ హరీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







