స్కిల్ డెవలప్ మెంట్ కేసు.. చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
- October 05, 2023
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్ ను ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇరు వైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇవాల్టితో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనకు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయం రేపు తేలనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







