కీలక రహదారిపై ప్రమాదం.. పొగమంచు కారణంగా వేగ పరిమితి తగ్గింపు
- October 06, 2023
యూఏఈ:ఎమిరేట్‌లోని కీలక రహదారిపై అబుదాబి అథారిటీ వాహనదారులను హెచ్చరించింది. అబుదాబి యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న అల్ ఐన్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి డ్రైవర్లకు తెలియజేయడానికి అబుదాబి పోలీసులు గతంలో ట్విటర్లో (X) ఒ పోస్ట్ ని చేశారు. సంబంధిత రహదారిపై రద్దీ, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా ప్రకటించిన హెచ్చరికలో పొగమంచు కారణంగా అబుదాబిలోని ఒక ప్రధాన రహదారిపై వేగ పరిమితి తగ్గించినట్లు పేర్కొన్నారు. ఇది షేక్ మహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులో గంటకు 80 కి.మీ.కి తగ్గించారు. పొగమంచు కారణంగా తక్కువ లో విజిబిలిటి కారణంగా డ్రైవర్లు జాగ్రత్త వహించాలని అధికార యంత్రాంగం కోరింది. వాహనదారులు సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ డైరెక్షనల్ బోర్డులను గమినించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







