ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. దుబాయ్-మనీలా సర్వీసులపై ప్రభావం?
- October 07, 2023
యూఏఈ: బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు.అయితే, దుబాయ్-మనీలా మధ్య విమానాలు యథాతధంగా నడిచాయని ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ రీజినల్ హెడ్-EMEA జోష్ వాస్క్వెజ్ తెలిపారు. దుబాయ్ నుండి మనీలా ఫ్లైట్‌తో సహా తమ విమాన షెడ్యూల్లలో ఎటువంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ ఫ్లాగ్ క్యారియర్లు దుబాయ్-మనీలా మధ్య రోజువారీ విమానాలను నడుపుతున్నాయి.
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CAAP)కి వాణిజ్య విమానాలలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో వివిధ ఫిలిప్పీన్స్ విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. స్నిఫర్ డాగ్‌లను మోహరించారు. ఏవియేషన్ రెగ్యులేటర్ 42 వాణిజ్య విమానాశ్రయాలను హై అలెర్ట్ లో పెట్టాయి. విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన సెబు, బికోల్, దావో మరియు పలావాన్లకు వెళ్లే విమానాల్లో తక్షణ భద్రతా చర్యలను అమలు చేసినట్టు CAAP ప్రతినిధి ఎరిక్ అపోలోనియో వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







