సిద్ధమవుతున్న అబుదాబి హిందూ దేవాలయం
- October 08, 2023
యూఏఈ: అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అవుతుంది. పింక్ ఇసుకరాళ్ళు, తెల్లని పాలరాయితో చేసిన చారిత్రాత్మక దేవాలయం దుబాయ్-అబుదాబి హైవేకి దూరంగా అబు మురీఖాలో 27 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఘనంగా ప్రారంభోత్సవం జరుగనుంది. మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయం చివరి దశ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అబుదాబి మొట్టమొదటి ఆలయం అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయం ఏడు గోపురాలు యూఏఈ ఎమిరేట్స్ ను సూచిస్తాయి. ఆలయ కాంప్లెక్స్‌లో సందర్శకుల కేంద్రం, ప్రార్థన మందిరాలు, లైబ్రరీ, తరగతి గది, కమ్యూనిటీ సెంటర్, మజిలీలు, యాంఫీథియేటర్, ఆట స్థలాలు, తోటలు, పుస్తకాలు , బహుమతి దుకాణాలు, ఫుడ్ కోర్ట్, పెద్ద పార్కింగ్ స్థలాలు, మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. BAPS స్వామినారాయణ్ సంస్థ ఆలయాన్ని నిర్మిస్తుంది. BAPS హిందూ మందిర్ అధినేత పూజ్య బ్రహ్మవిహారిదాస్ స్వామి ఈ మెగా ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. చేతితో చెక్కబడిన ఆలయం పురాతన హిందూ 'శిల్ప శాస్త్రాల' ప్రకారం నిర్మిస్తున్నారు. శిల్పకళలో భాగంగా హిందూ సంస్కృతిని సూచించే గుర్రాలు, ఒంటెలు, ఒరిక్స్ వంటి అరబ్ చిహ్నాలను కలిగి ఉన్నాయి. భారతీయ ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, హిందూ గ్రంధాలు, పురాణాల నుండి ఇతర కథనాల నుండి కీలక ఘట్టాలను వర్ణించేలా హస్తకళాకారులు రూపొందిస్తున్నారు. 108 అడుగుల ఎత్తైన ఆలయం "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" గా ప్రశంసించబడింది. ఇది 1,000 సంవత్సరాలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 14న ‘ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ’తో ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభ వేడుక, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా లేదా https://festivalofharmony.aeని సందర్శించాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







