ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలని యూఏఈ పిలుపు

- October 08, 2023 , by Maagulf
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలని యూఏఈ పిలుపు

యూఏఈ: ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య పెరుగుతున్న హింసకు ముగింపు పలకాలని యూఏఈ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  ఇప్పటికే ఈ ఘటనలో సంభవించిన మరణాలపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదకరమైన పరిణామాలను నివారించడానికి సంయమనం పాటించాలని, తక్షణ కాల్పుల విరమణను పాటించాలని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటిలోనూ హింస పెరగడంతో 200 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబాటును చేపట్టారు. సరిహద్దుల గుండా ప్రవేశించారు. పాలక హమాస్ మిలిటెంట్ గ్రూప్ కొత్త ఆపరేషన్ ప్రారంభించి ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్‌లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది. వైమానిక దాడులతో రెచ్చిపోయింది. యూఏఈ –యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా - అరబ్-ఇజ్రాయెల్ శాంతి మార్గాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ క్వార్టెట్‌ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com