ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలని యూఏఈ పిలుపు
- October 08, 2023
యూఏఈ: ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య పెరుగుతున్న హింసకు ముగింపు పలకాలని యూఏఈ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో సంభవించిన మరణాలపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదకరమైన పరిణామాలను నివారించడానికి సంయమనం పాటించాలని, తక్షణ కాల్పుల విరమణను పాటించాలని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటిలోనూ హింస పెరగడంతో 200 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబాటును చేపట్టారు. సరిహద్దుల గుండా ప్రవేశించారు. పాలక హమాస్ మిలిటెంట్ గ్రూప్ కొత్త ఆపరేషన్ ప్రారంభించి ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది. వైమానిక దాడులతో రెచ్చిపోయింది. యూఏఈ –యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా - అరబ్-ఇజ్రాయెల్ శాంతి మార్గాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ క్వార్టెట్‌ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







