ఆదిపర్వంలో మంచులక్ష్మీ.. ఫస్ట్ లుక్
- October 08, 2023
హైదరాబాద్: మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి, తన మాటలు, ఇంటర్వ్యూలు, సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులని మెప్పించింది. తన మీద ట్రోల్స్ వచ్చినా ఎపుడూ ఏదో ఒక విషయంలో మంచు లక్ష్మి వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి కొన్ని బిజినెస్ లు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంది.
మంచు లక్ష్మి త్వరలో అగ్ని నక్షత్రం అనే సినిమాతో రాబోతుంది. అది కాకుండా తాజాగా మరో కొత్త సినిమాతో రాబోతుంది. నేడు మంచు లక్ష్మి పుట్టిన రోజు కావడంతో మంచు లక్ష్మి కొత్త సినిమా ఆదిపర్వం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో మంచు లక్ష్మి చీర కట్టుకొని కూర్చొని కోపంగా అమ్మోరులా చూస్తుంది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఎర్రగుడి అమ్మవారి నేపథ్యంలో 1990 లలో జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి మెయిన్ లీడ్ పోషించగా ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని.. మరికొంతమంది పలువురు ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ సీరియస్ గా భయపెట్టే విధంగా ఉండటంతో ఈసారి మరో కొత్తరకం క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







