సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు
- October 08, 2023
సింగపూరు: సింగపూరు తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగుతోరణం తెలుగు నీతిపద్యాల పోటీ చివరి వృత్తం దాదాపు మూడు వందల ప్రేక్షకుల నడుమ, ప్రత్యక్ష ప్రసారంగా ఘనంగా నిర్వహించబడింది.
సింగపూరు తెలుగు ప్రముఖులు డా. బి.వీ.ఆర్.చౌదరి, రాజ్యలక్ష్మి దంపతులతో పాటుగా సింగపూరు నందు ఉన్న తెలుగు సంస్థలు సింగపూరు తెలుగు సమాజం, తెలంగాణా కల్చరల్ సొసైటీ సింగపూరు, కాకతీయ సాంస్కృతిక పరివారము, శ్రీ సాంస్కృతిక కళా సారధి, పోతన భాగవత ప్రచార సమితి సంస్థల ప్రతినిధులతో పాటుగా తెలుగు సమూహాలు అయిన మనం తెలుగు, అమ్ములు, తెలుగు వనితలు మరియు ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యి ఈ కార్యక్రమం ఆసాంతం వీక్షించి తమ అభినందలను తెలియచేసారు. కార్యక్రమ తననంతరం నిర్వ్హాహకులు వారిని కృతజ్ఞతా జ్ఞాపికలతో సత్కరించుకున్నారు. అదే విధంగా కార్యక్రమం అనుకున్నది మొదలు ఎందరో తమంత తాముగా ముందుకు వచ్చి కార్యక్రమ నిర్వహణకు పోషకులుగా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా ఈ వేదిక మీద సత్కరించుకోవడం జరిగింది.
20 మంది చిన్నారులతో పది వారాల పాటు జరిగిన ఈ పద్యాల పోటీ సింగపూరులోనే మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా నిలిచి ఇక్కడ ఉన్న చిన్నారులలోని తెలుగు ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్నెన్నో పద్యాలు నేర్చుకుని, పద్యం చెప్పడమే కాకుండా దాని భావాన్ని, అర్ధాన్ని ఉదాహరణలతో, చిన్ని చిన్ని నీతి కథలతో సహా వివరించడం ఈ పోటీపై వారికున్న ఇష్టాన్ని, శ్రద్దను తెలియ చేసింది, ప్రేక్షకులను అలరించింది. చిన్నారుల తల్లి తండ్రులు మాట్లాడుతూ ఈ పోటీ వల్ల తమకు కూడా మరొక్కసారి ఈ నీతి పద్యాలను చదువుకునే అవకాశం కలిగిందని,దాని అర్ధాలు ఇప్పటి సమాజానికి ఎలా వర్తిస్తాయో కూడా అన్వయించుకోవడం వల్ల ఈ పోటీ తమకు కూడా జీవితానికి ఒక రివిజన్ లా అనిపించిందని తెలియచేసారు. అలాగే ఈ కార్యక్రమం చూసిన స్పూర్తితో ఇంటి వద్ద తమ చిన్నారులు కూడా తెలుగు నీతి పద్యాలను నేర్చుకుంటున్నారు అని కార్యక్రమానికి హాజరయిన తెలుగు వారు తెలియచేయడం జరిగింది. ఈ పోటీ లో మొదటి స్థానంలో చి. ఓరుగంటి రాధా శ్రీనిధి, రెండవ స్థానంలో చి.సూదలగుంట ఆరాధ్య మూడవ స్థానంలో చి. సింగిరెడ్డి శ్రీనిత విజేతలుగా ఎన్నికయ్యారు. విజేతలతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులందరికీ తెలుగు ప్రముఖులు జ్ఞాపికలు అందించడంతో పాటుగా దాదాపు 3 వేల డాలర్ల వరకూ నగదు బహుమతులు కూడా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికీ అలాగే సాంస్కృతికి కార్యమాలు ప్రదర్శించిన వారు అందరికీ తెలుగు ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు ప్రధానం చేయడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాన్ని, పోటీలో పాల్గొన్న చిన్నారులనూ దీవిస్తూ సాయి కుమార్, తనికెళ్ళ భరణి, రాధికా, భువన చంద్ర వంటి సినీ ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను కూడా వేదిక మీద ప్రదర్శించడం జరిగింది.
కార్యక్రమ నిర్వాహకులు రాధా కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న మాట్లాడుతూ సింగపూరు నందు ఉన్న అన్ని తెలుగు సంస్థలూ అలాగే అందరు తెలుగు ప్రముఖులూ ఒకే సారి ఈ వేదిక మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు అందించడం చాలా సంతోషదాయకంగా ఉంది అని,అన్ని తెలుగు సంస్థల ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమ కల అని అది ఈ రోజు నెరవేరిందని తెలియచేసారు. అలాగే తమ తమ చదువులతో బిజీగా ఉన్నా తెలుగు భాష మీడ మక్కువతో పద్యాలు నేర్చుకుని కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారికి శిక్షణ ఇచ్చిన తల్లి తండ్రులకు తమ కృతజ్ఞతలు అని తెలియచేసారు. ఇది తెలుగు భాషకు తమ వంతుగా చేసుకున్న ఒక చిన్న సేవ అని, ఇంత పెద్ద వేదిక మీద ఇంతటి పెద్ద కార్యక్రమం పది భాగాలుగా నిర్వహించగలగడం అందరి తెలుగు వారి సహకారంతో మాత్రమే సాధ్యమయింది అని, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామని ఈ కార్యక్రమం స్పూర్తితో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు సింగపూరు నుండి వస్తాయని ఆశిస్తున్నామని వాటికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియచేసారు.
ఈ నీతి పద్యాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రాంబాబు పాతూరి, అపర్ణ గాడేపల్లి మరియు సౌభాగ్యలక్ష్మి తంగిరాల గార్లు కార్యక్రమ ప్రణాళికలో పాలుపంచుకుని పిల్లలకు అనువైన పద్యాలను ఎంపిక చేసి అందించడమే కాకుండా పిల్లలు చెప్పిన ప్రతి పద్యానికీ వివరణాత్మకమైన విశ్లేషణ చేస్తూ, చిన్నారులు మరింత కొత్తదనంతో ఎలా నేర్చుకోవచ్చో సలహాలు అందించి వారిని ప్రోత్సహించారు. అలాగే వ్యాఖ్యాతలుగా కవిత కుందుర్తి, సుబ్బు పాలకుర్తి చిన్నారులు వేదిక మీద భయం లేకుండా పద్యాలు చెప్పేలా వారిని ఉత్సాహ పరిచి సరదా సరదా సంభాషణలతో కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు.



తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









