అ..ఆ..కు రిలీజ్ డేట్ ఫిక్స్..
- May 21, 2016
త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ సినిమా అ..ఆ..కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను జూన్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. మే మొదట్లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా పడింది. ముందుగా మే 6న అ..ఆ.. ను రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో సూర్య హీరోగా తెరకెక్కిన ప్రస్టీజియన్ మూవీ 24 రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు. తరువాత మే 20న ముహుర్తం ఫిక్స్ చేసుకున్నా, మహేష్ బ్రహ్మోత్సవానికి రెడీ అవుతున్నాడని వెనుకడుగు వేశారు.అయితే ఈ శుక్రవారం రిలీజ్ అయిన బ్రహ్మోత్సవంకు డివైడ్ టాక్ రావటంతో తమ సినిమాకు లైన్ క్లియర్ అని భావిస్తున్నారు అ..ఆ.. యూనిట్. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా సక్సెస్ పై చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. దీనికి తోడు లాంగ్ వీకెండ్ కూడా అ..ఆ.. కలెక్షన్లకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. జూన్ 2న సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







