జిమ్ బస్సు
- May 21, 2016
ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తమ వ్యక్తిగత అవసరాలకు.. ఆరోగ్యానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే చెప్పాలి. పొద్దుట్నుంచి.. సాయంత్రం దాకా ఆఫీసు పనులు.. రాత్రులు పార్టీలు అంటూ.. అర్థరాత్రి దాటాక పడుకోవడం.. పొద్దునే లేచి మళ్లీ ఆఫీసుకు పరుగులంకించడం. దీంతో ఆరోగ్యానికి ఉపయోగపడే యోగాలు.. వ్యాయామం చేసే తీరిక జనాలకు లేకుండా పోతోంది. అందుకే ఓ సంస్థ విన్నూతంగా.. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనే బస్సుల్లో వ్యాయామం చేసేట్టుగా జిమ్ బస్సుల్ని రూపొందించింది.
లండన్‌కి చెందిన '1 రెబల్' అనే ఫిట్‌నెస్ సంస్థ ఈ జిమ్ బస్సుల్ని రూపొందించింది. ఈ బస్సులో జిమ్‌లో ఉండే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో జిమ్‌కి వెళ్లి ఎక్సర్‌సైజ్ చేసేంత సమయం లేని ఉద్యోగులు ఆఫీసుకు వెళ్తూనే జిమ్ చేయొచ్చు.
అయితే 45 నిమిషాల ప్రయాణానికి 12 నుంచి 15 పౌండ్లు ఛార్జ్ చేస్తారట. రోజువారీ పనులు చేసుకుంటూనే.. ఖాళీగా ప్రయాణించే సమయంలోనే ఆరోగ్యవంతమైన జీవితం పొందడానికి ఈ జిమ్ బస్సులు ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే లండన్‌లోని ప్రధాన రూట్లలో ఈ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







