‘కాంతితో క్రాంతి’లో నినదించిన తెదేపా శ్రేణులు
- October 08, 2023
అమరావతి: అక్రమ అరెస్టుతో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా ఢిల్లీలో నిర్వహించిన కాంతితో క్రాంతి కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైకాపా సర్కారు తీరుపై నిరసన తెలిపారు. సేవ్ ఏపి… సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని శనివారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పాల్గొన్నారు. భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







