రామ్ సరసన ఆ బాలీవుడ్ హీరోయిన్.? పూరీ మామూలోడు కాదు.!
- October 09, 2023
‘స్కంధ’ సినిమాతో ఇటీవల రామ్ పోతినేని ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చింది కానీ, నిలబడలేకపోయింది. బోయపాటి అతికి రామ్ లాంటి హీరో నిలదొక్కుకోవడం కష్టమే అని తేల్చేశారంతా.!
ఆ సంగతి అటుంచితే, రామ్ పోతినేని ఖాతాలో మరో ప్రెస్టీజియస్ మూవీ కూడా వుంది. అదే ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం పూరీ భారీ ప్లానింగే చేస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని దించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఆమె ఎవరో కాదు, సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా ఆలీ ఖాన్ అట. మరి జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, ఈ సినిమాతోనే సారా అలీఖాన్ తెలుగులోకి డెబ్యూ చేయబోతుంది. ‘లైగర్’ సినిమా కోసం అనన్యా పాండేని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశాడు పూరీ. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
కానీ, ‘డబుల్ ఇస్మార్ట్’ విషయంలో పూరీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయనీ తెలుస్తోంది. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







