‘చిన్నా’ కలెక్షన్ల హంగామా.! సిద్దార్డ్కి ‘బిగ్’ ఛాన్సులే.!
- October 09, 2023
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ , ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాలతో హీరోగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న హీరో సిద్దార్ధ్. అమ్మాయిల కలల రాకుమారుడు. యూత్‌లో ట్రెండ్ సెట్టర్. అయితే, ఈ మధ్య సిద్దార్ధ్కి పెద్దగా కలిసి రావడం లేదు.
ఏవేవో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ, అవన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు దక్కించుకోవడం లేదు. దాంతో, దాదాపు సిద్దూని మర్చిపోయారు తెలుగు ప్రేక్షకులు. ఈ టైమ్‌లో ‘చిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని సరికొత్తగా పలకరించాడు సిద్దార్ద్.
ఈ వారమే ధియేటర్లలో సందడి చేసింది ‘చిన్నా’ సినిమా. ఈ సినిమాతో పాటూ, చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయ్ ఈ వారం. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘చిన్నా’ సినిమా ఆడియన్స్‌ని మెప్పించింది. ఓ చిన్న పాపకీ హీరోకీ మధ్య వుండే ఎమోషనల్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు.
అన్నట్లు ఈ సినిమాకి నిర్మాత కూడా సిద్ధార్ధే. మంచి టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు బుల్లితెరపై టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్ గేమ్ షోలో సిద్దార్ద్ గెస్ట్‌గా వచ్చి కంటెస్టెంట్లతో తన సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటూ చేసిన హంగామాతో ఈ సినిమా గురించి ఇంకా బాగా తెలిసింది.
మొత్తానికి బిగ్‌హౌస్‌లో చిన్నాగా సిద్దూ చేసిన అల్లరి, ఇంతవరకూ ఈ సినిమా గురించి తెలియని వాళ్లకు కూడా తెలియ చెప్పేలా చేసింది. దాంతో, ‘చిన్నా’కి కలెక్షన్ల హవా ఇంకాస్త పెరిగేలానే కనిపిస్తోంది చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







