పౌరులకు రక్షణ కల్పించాలి, హింసను తక్షణమే ముగించాలి:యూఏఈ అప్పీల్
- October 09, 2023
యూఏఈ: పౌరులకు రక్షణ కల్పించాలని, తక్షణమే హింసను ముగించాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణాలు, గ్రామాలపై హమాస్ దాడులు, జనాభా కేంద్రాలపై వేల రాకెట్లను ప్రయోగించడం తీవ్రమైన చర్యలని, ఇజ్రాయెల్ పౌరులను వారి ఇళ్ల నుండి బందీలుగా అపహరించినట్లు వచ్చిన నివేదికలతో మంత్రిత్వ శాఖ విస్మయం చెందిందని తెలిపారు. రెండు వైపులా పౌరులు ఎల్లప్పుడూ అంతర్జాతీయ మానవతా చట్టం కింద పూర్తి రక్షణ కలిగి ఉండాలని సూచించింది. బాధిత కుటుంబాలకు యూఏఈ తన సంతాపాన్ని తెలియజేసింది. ప్రాంతీయ ఘర్షణను నివారించడానికి అన్ని దౌత్య ప్రయత్నాల కోసం అప్పీల్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







